Jammu And Kashmir: సైన్యం కాల్పుల్లో ముగ్గురి మృతి.. ఉద్రిక్తంగా జమ్ముకశ్మీర్

  • హవూరా గ్రామంలో కార్డన్ సర్చ్ చేపట్టిన సైన్యం
  • రాళ్లు రువ్విన అల్లరిమూకలు
  • నాలుగు జిల్లాలలో భారీగా మోహరించిన సైన్యం
జమ్ముకశ్మీర్ లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కుల్గామ్ జిల్లాలోని హవూరా గ్రామంలో ఈ ఉదయం భద్రతాబలగాలు కార్డన్ సర్చ్ చేపట్టాయి. ఈ సందర్భంగా సైనికులపై అల్లరిమూక రాళ్లదాడికి పాల్పడింది. దీన్ని నిలువరించే ప్రయత్నంలో సైన్యం కాల్పులు ప్రారంభించింది. ఈ కాల్పుల్లో ఇద్దరు యువకులతో పాటు ఓ బాలిక ప్రాణాలను కోల్పోయింది. మరో పదిమందికి బుల్లెట్ గాయాలయినట్టు సమాచారం.

మృతులను షకీర్ అహ్మద్ (22), ఇర్షద్ మాజిద్ (20), అంద్లీబ్ (16)గా గుర్తించారు. మరోవైపు, పుకార్లు చెలరేగకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అనంతనాగ్, సోఫియాన్, పుల్వామా, కుల్గామ్ జిల్లాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరింపజేశారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సైన్యం సిద్ధంగా ఉంది. 
Jammu And Kashmir
army
fire
stone pelters
dead

More Telugu News