అప్పట్లోనే నా భర్తకు సొంత విమానం ఉండేది: అలనాటి కథానాయిక కేఆర్ విజయ
- దేవత పాత్రలు అలా వచ్చాయి
- వేలాయుధంతో వివాహం జరిగింది
- ఆయన మంచి మనసున్న మనిషి
అలాంటి ఆమె తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "శ్రీకృష్ణ పాండవీయం'లో రుక్మిణీదేవి పాత్రలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ పాత్ర నాకు చాలామంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా నుంచే నన్ను దేవతా పాత్రలకి ఎక్కువగా అడిగేవారు. ప్రముఖ వ్యాపార వేత్త .. నిర్మాత అయిన 'వేలాయుధం'తో నా వివాహం జరిగింది. అప్పట్లోనే ఆయనకి సొంత విమానం .. షిప్పు ఉండేవి. అయితే నేను ఆయన ఆస్తిని చూసి ప్రేమించలేదు .. ఆయన మంచితనం .. మంచి మనసును చూసి మాత్రమే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను" అని ఆమె చెప్పుకొచ్చారు.