pawan kalyan: చేగువేరా విగ్రహం పక్కన నా కుమార్తె!: ఫొటో పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్

  • సెయింట్ పీటర్స్ బర్గ్ మ్యూజియంలో చే బొమ్మ పక్కన నిలబడి ఫొటో దిగిన పొలీనా
  • సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పవన్
  • ఇంటర్ తొలి సంవత్సరం చదువుతున్నప్పుడు చే గురించి తొలిసారి చదివా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విప్లవకారుడు చేగువేరా అంటే అంతులేని అభిమానమనే విషయం తెలిసిందే. చే నుంచి తాను ఎంతో స్ఫూర్తిని పొందానని ఆయన ఎన్నో సార్లు చెప్పారు. తాజాగా రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఉన్న మ్యూజియంలో చేగువేరా మైనపు విగ్రహం పక్కన నిలబడి... తన కుమార్తె పొలీనా అంజనీ దిగిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా ఆయన పంచుకున్నారు. చేగువేరా మాదిరి చేయెత్తి పిడికిలి చూపిస్తున్న పొలీనా ఫొటో ఎంతో ఆకట్టుకుంటోంది.

"నెల్లూరులో ఇంటర్ తొలి సంవత్సరం చదువుతున్నప్పుడు... తొలిసారి చేగువేరా గురించి చదివా. ఏదో ఒక రూపంలో, ఎక్కడో ఒక చోట ఆయన నా జీవితంలో ఉంటున్నారు. ఇలా జరుగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది" అంటూ ట్వీట్ చేశారు.
pawan kalyan
Polina Anjani
che

More Telugu News