tana: 'తానా' అధ్యక్షుడిపై దుష్ప్రచారం చేస్తున్న తెనాలి యువకుడు అరెస్ట్

  • సామాజిక మాధ్యమాల వేదికగా వేమన సతీష్ పై దుష్ప్రచారం
  • వల్లభనేని భార్గవ్ ను అరెస్టు చేసిన పోలీసులు
  • అతనికి సహకరించిన మరో నలుగురిపైనా కేసు నమోదు
తానా అధ్యక్షుడు వేమన సతీష్ పై దుష్ప్రచారానికి పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువకుడు వల్లభనేని భార్గవ్ ఈ దుష్ప్రచారం చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. భార్గవ్ కు సహకరించిన మరో నలుగురిపై కూడా కేసు నమోదు చేశామని అన్నారు. విచారణ పూర్తయిన అనంతరం, నిందితులు పల్లేటి వెంకటమోహన్, పుట్టి శరత్, పరుచూరి ధరణీధర్, గోపాలకృష్ణపై లుకౌట్ నోటీసులు జారీ చేస్తామని పోలీసులు చెప్పారు. 
tana
vemana satish

More Telugu News