kanna laxmi narayana: కన్నాపై చెప్పులు వేసి రౌడీయిజం చేస్తున్నారు: సీనియర్ నటుడు కృష్ణంరాజు

  • ఏపీలో టీడీపీ భౌతికదాడులకు దిగుతోంది
  • తగిన సమయం చూసి టీడీపీకి ప్రజలే బుద్ధిచెబుతారు
  • బీజేపీ.. రైతుపక్షపాతి
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై చెప్పులు విసిరిన సంఘటనపై బీజేపీ నేత, సీనియర్ నటుడు కృష్ణంరాజు స్పందించారు. ఏపీలో టీడీపీ భౌతికదాడులకు దిగుతోందని, కన్నాపై చెప్పులు వేసి రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని, తగిన సమయం చూసి ఆ పార్టీకి ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు.

ఈ సందర్భంగా పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన కేంద్రంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ముప్పై మూడేళ్లలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో మద్దతు ధర పెరగలేదని, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్నదే బీజేపీ లక్ష్యమని, బీజేపీ..రైతుపక్షపాతి అని కితాబిచ్చారు. 
kanna laxmi narayana
krishnamraj

More Telugu News