Andhra Pradesh: అలా చేస్తే మీతో పాటు నేనూ వస్తా.. రైల్‌ రోకో చేద్దాం: టీడీపీకి పవన్‌ కల్యాణ్‌ సవాల్‌

  • టీడీపీలోని ఎంపీలు రాజీనామా చేయండి
  • ఏపీలో ఎక్కడ చూసినా భూదోపిడిలే జరుగుతున్నాయి
  • టీడీపీ నేత‌లే ముందున్నారు
  • చంద్రబాబు, జగన్‌ కలిసి ఉమ్మడి పోరాటం చేయగలరా?
ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు డిమాండ్ చేస్తూ టీడీపీలోని ఎంపీలు రాజీనామా చేయాలని, అలా చేస్తే వారితో పాటు తానూ వస్తానని, కలసి రైల్‌ రోకో చేద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సలహా ఇచ్చారు. విశాఖపట్నం జిల్లాలోని తగరపువలసలో ఈరోజు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్‌, మురళీమోహన్‌లకు ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖపట్నంలో రైల్వే జోన్ అంటే హేళన అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా భూదోపిడీలే జరుగుతున్నాయని, వాటిల్లో టీడీపీ నేత‌లే ముందున్నార‌ని పవన్ కల్యాణ్‌ ఆరోపించారు. విశాఖపట్నానికి రైల్వే జోన్‌ విషయంలో తన తీరు ఏంటని కొందరు అడుగుతున్నారని, ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి తనతో కలిసి ఉమ్మడి పోరాటం చేయగలరా? అని పవన్ ప్రశ్నించారు. ముందు వారి వైఖరి ఏంటో చెప్పాలని సవాలు విసిరారు.  
Andhra Pradesh
Pawan Kalyan
Jana Sena

More Telugu News