కన్నాపై చెప్పు విసిరిన వ్యక్తిపై దాడి చేసిన బీజేపీ నేతలపై కేసు నమోదు!
- కన్నాపై చెప్పు విసిరిన లారీ యజమాని మహేశ్వరరావు
- చితకబాదిన బీజేపీ నేతలు, కార్యకర్తలు
- కావలి ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితుడు
ఈ సందర్భంగా మహేశ్వరరావు మాట్లాడుతూ, లారీ యజమానిగా తాను పడుతున్న ఇబ్బందులు గుర్తుకువచ్చి, ఆగ్రహంతో కన్నాపై చెప్పు విసిరానని చెప్పాడు. ఉద్దేశపూర్వకంగా తాను ఆ పని చేయలేదని తెలిపాడు. పోలీసులు అడ్డుకుంటున్నా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తనపై విచక్షణారహితంగా దాడి చేశారని చెప్పాడు. తనపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. కావలిలోని ఏరియా ఆసుపత్రిలో మహేశ్వరరావు వైద్యచికిత్స పొందాడు.