kalyan dev: సెన్సార్ పూర్తి చేసుకున్న 'విజేత'

  • కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత'
  • కథానాయికగా మాళవిక నాయర్ 
  • ఈ నెల 12వ తేదీన రిలీజ్        

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ మొదటి సినిమాగా .. రాకేశ్ శశి దర్శకత్వంలో 'విజేత' సినిమా రూపొందింది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, క్లీన్ యూ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది.

ఈ సినిమాలో కల్యాణ్ దేవ్ సరసన కథానాయికగా మాళవిక నాయర్ నటించింది. వారాహి చలన చిత్రం బ్యానర్లో తండ్రీకొడుకుల అనుబంధానికి అద్దంపట్టే కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మితమైంది. కల్యాణ్ దేవ్ తండ్రి పాత్రలో మురళీ శర్మ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి .. ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. దాంతో ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో కల్యాణ్ దేవ్ వున్నాడు. ఆయన నమ్మకం నిజమవుతుందేమో చూడాలి మరి. 

  • Loading...

More Telugu News