jagan: వైసీపీ అధినేత జగన్ గతేడాది చేసిన బంగీ జంప్ సాహసం.. తాజాగా వీడియో విడుదల!

  • గతేడాది న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన జగన్
  • కుటుంబ సభ్యులతో కలసి ఎంజాయ్ చేసిన వైసీపీ అధినేత
  • 134 మీటర్ల బంగీ జంప్ సాహసం
గతేడాది వైసీపీ అధినేత జగన్ తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ కు విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. అనునిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే వైసీపీ అధినేత తన కుటుంబసభ్యులతో కలసి ఆ పర్యటనను ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక సాహసం చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కవారా బ్రిడ్జ్ పై నుంచి ఆయన 134 మీటర్ల బంగీ జంప్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. మీరూ చూడండి..
jagan
bungee jump
video

More Telugu News