kiran kumar reddy: ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు!: కాంగ్రెస్ లో చేరికపై కిరణ్‌కుమార్‌ రెడ్డి

  • ఈ నెల 13న కాంగ్రెస్‌లో చేరతారని వార్తలు
  • స్పందించిన మాజీ సీఎం
  • తానింకా ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం

ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను మీడియా సంప్రదించింది. ఈ సందర్భంగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి స్పందిస్తూ... తాను కూడా ఈ వార్తలను టీవీ ఛానెళ్లలోనే చూసి తెలుసుకుంటున్నానని చమత్కరించారు. తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

కాగా, ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆ పార్టీ కండువా కప్పుకుంటారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.  

More Telugu News