Tirumala: అక్టోబర్ నెల తిరుమల వెంకన్న సేవా టికెట్లు ఆన్ లైన్ లో... వివరాలివి!

  • 53,642 టికెట్లు విడుదల
  • లక్కీ డిప్ లో 9,742 టికెట్లు
  • జనరల్ కోటా కింద 43,900 టికెట్లు
అక్టోబర్ నెలలో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సేవా టికెట్లకు సంబంధించి ఆన్ లైన్ లో 53,642 టికెట్లను విడుదల చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. వీటిల్లో లక్కీ డిప్ కింద 9,742 టికెట్లను ఉంచామని తెలిపింది. సుప్రభాతం, అర్చన, తోమాల, నిజపాదదర్శనం టికెట్లను కోరుకునే వారు నాలుగు రోజుల్లోగా ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలని, ఆ తరువాత లక్కీ డిప్ తీసి టికెట్లు పొందిన వారి వివరాలను ప్రకటిస్తామని వెల్లడించింది. జనరల్ కోటా కింద కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ వంటి వాటికి 43,900 టికెట్లను ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.
Tirumala
Tirupati
Arjita Sevas
Lucky Dip
TTD

More Telugu News