sanju: బాక్సాఫీసును కొల్లగొడుతున్న 'సంజు'.. ఆరు రోజుల కలెక్షన్ల వివరాలు!

  • తొలి ఆరు రోజుల్లో రూ. 186.41 కోట్ల వసూళ్లు
  • నేటితో రూ. 200 క్లబ్బులో చేరనున్న 'సంజు'
  • రణబీర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం? 

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవిత చరిత్రతో తెరకెక్కిన 'సంజు' సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే మంచి టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం... భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. తొలి ఆరు రోజుల్లో ఈ చిత్రం రూ. 186.41 కోట్లను రాబట్టింది. ఈ వివరాలను ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించాడు. ఈ సందర్భంగా తరణ్ ట్వీట్ చేస్తూ, రణబీర్ కెరీర్లోనే ఈ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలుస్తుందని చెప్పాడు. ఈ రోజుతో రూ. 200 కోట్ల క్లబ్బులో చేరుతుందని తెలిపాడు.  

More Telugu News