sabbam hari: అలా మాట్లాడినందుకే పవన్ పై ఉత్తరాంధ్రలో వ్యతిరేకత వచ్చింది!: సబ్బం హరి

  • గత ఎన్నికల్లో పవన్ వల్లే అశోక్ గజపతిరాజు గెలిచారట
  • 1983 నుంచి 2014 వరకు ఆయన గెలుస్తూ వస్తున్నారు
  • టీడీపీలో క్రమశిక్షణ గల సీనియర్ నేత అశోక్ గజపతిరాజు
గత ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తన వల్లే గెలిచారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారని, అలా మాట్లాడినందుకే, పవన్ పై ఉత్తరాంధ్రలో వ్యతిరేకత ఏర్పడిందని మాజీ ఎంపీ సబ్బం హరి విమర్శించారు.

‘ఏబీఎన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘అశోక్ గజపతిరాజు అనుభవిస్తున్న వన్నీ పవన్ దయ వల్లే అన్నట్టు ఆయన మాట్లాడారు. అలా మాట్లాడినందుకు పవన్ పట్ల ఉత్తరాంధ్రలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.1983 నుంచి 2014 వరకు అశోక్ గజపతిరాజు గెలుస్తూ వస్తున్నారు. అప్పుడు కూడా అశోక్ గజపతిరాజును పవనే గెలిపించారా? టీడీపీలో క్రమశిక్షణ గల సీనియర్ నేత అశోక్ గజపతిరాజు’ అని అన్నారు.

ఈ సందర్భంగా తాను ఏ పార్టీలో చేరే విషయం ఎన్నికల నాటికి చెబుతానని అన్నారు. 2019 ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని, టీడీపీలో చేరాలంటూ చంద్రబాబు రెండుసార్లు తనను ఆహ్వానించారని, అయినా తాను ఆ పార్టీలోకి వెళ్లలేదని అన్నారు. అదేవిధంగా బీజేపీలో చేరమని వెంకయ్యనాయుడు కూడా తనను అడిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.  
sabbam hari
Chandrababu
ashok gajapathi

More Telugu News