Narendra Modi: ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతినడానికి కారణం మోదీయే: ఇమ్రాన్ ఖాన్

  • అంతర్జాతీయంగా పాకిస్థాన్ ను ఏకాకిని చేయాలని చూస్తున్నారు
  • కశ్మీర్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో దురాగతాలు చేస్తోంది
  • వీటన్నింటికి మా దేశాన్ని మోదీ సర్కార్ నిందిస్తోంది

ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతినడానికి కారణం భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమేనని పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అంతర్జాతీయంగా పాకిస్థాన్ ను ఏకాకిని చేయాలనే ఉద్దేశంతో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కశ్మీర్ లో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలన్నింటికీ తమ దేశాన్ని మోదీ సర్కార్ నిందిస్తోందని, నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్న సమయంలో భారత్ తో సత్సంబంధాల కోసం ఎంతగానో ఆయన ప్రయత్నించారని, మోదీని తన ఇంటికి కూడా షరీఫ్ ఆహ్వానించారని చెప్పుకొచ్చారు.

 కాగా, ఈ నెల 25 పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయమై ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, పాకిస్థాన్ లో గెలవాలంటే డబ్బు, వేల మంది శిక్షణ తీసుకున్న పోలింగ్ ఏజెంట్లు కావాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడినప్పుడే మిలిటరీ పాలనను ప్రజలు ఆహ్వానిస్తారని అన్నారు. పాక్ లో ఏ పార్టీ మెరుగైన పాలనను అందించకపోవడం వల్లే మిలిటరీ పాలించే పరిస్థితి వచ్చిందని ఇమ్రాన్ అన్నారు.

More Telugu News