Donald Trump: ట్రంప్‌ తీరుకి నిరసనగా.. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ ఎక్కడానికి ప్రయత్నించిన మహిళ!

  • స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటోన్న అమెరికా
  • వలసలకు వ్యతిరేకంగా ఉన్న ట్రంప్‌
  • ఇటీవల చిన్నారులను తల్లిదండ్రుల నుంచి వేరు చేసిన దళాలు
  • కాంగో నుంచి వలస వచ్చిన మహిళ ఆందోళన

అమెరికా ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఇదే రోజున ఓ మహిళ వినూత్నంగా నిరసన తెలిపే ప్రయత్నం చేసింది. వలసలకు వ్యతిరేకంగా రెండు వేల మందికి పైగా చిన్నారులను తమ తల్లిదండ్రుల నుంచి అమెరికా దళాలు వేరు చేసి శిబిరాలకు తరలించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అవలంబిస్తోన్న ఈ జీరో టోలరెన్సీ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. కాంగో నుంచి వలస వచ్చిన థెరెస్సీ పట్రికా ఒకమౌ (44) అనే మహిళ స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ విగ్రహాన్ని ఎక్కేందుకు యత్నించింది.  

విగ్రహం మొదలు భాగానికి ఎక్కి కూర్చున్న ఆమెను కిందకు దిగమని అధికారులు కోరినప్పటికీ ఆమె తాను దిగబోనని చెప్పింది. తల్లిదండ్రుల నుంచి వేరు చేసిన చిన్నారులను తిరిగి కలపాలని డిమాండ్ చేసింది. ఆమెకు మద్దతుగా మరికొంతమంది అక్కడకు చేరుకున్నారు. పోలీసులు దాదాపు మూడు గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు ఆమెను కిందకు దింపారు.                                          

More Telugu News