janagama: జనగామ హైవేపై స్కూల్‌ విద్యార్థుల ధర్నా.. 2 కి.మీ మేర నిలిచిన వాహనాలు

  • తమ పాఠశాలలో టీచర్లు లేరని ఆందోళన
  • ఇప్పటి వరకు పాఠాలు ప్రారంభం కాలేదన్న విద్యార్థులు 
  • చంపక్‌హిల్స్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాల దుస్థితి

తమ పాఠశాలలో ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు పాఠాలు చెప్పేందుకు ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేరని, ఇప్పటి వరకు పాఠాలు ప్రారంభం కాలేదని విద్యార్థులు ధర్నాకు దిగిన ఘటన జనగామ జిల్లా పసరమడ్ల శివారు చంపక్‌హిల్స్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాల వద్ద చోటు చేసుకుంది. ఆ పాఠశాల విద్యార్థులకు ట్రైబల్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ విద్యార్థి సంఘం మద్దతుగా నిలిచింది.

విద్యార్థులతో కలిసి జనగామ-సిద్దిపేట ప్రధాన రహదారిపై వారు రాస్తారోకోకు దిగడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అక్కడకు చేరుకున్న పోలీసులు విద్యార్థి సంఘం నాయకులను అరెస్ట్ చేశారు. ఆ పాఠశాలలో ఇప్పటికే 68 మంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోయారని విద్యార్థి సంఘం నాయకులు పేర్కొన్నారు. 

More Telugu News