Mallika Sharawat: హీరోలతో చనువుగా లేనందుకే కొన్ని సినిమాల నుంచి నన్ను తప్పించారు: మల్లికా షరావత్

  • చనువుగా ఉండమని హీరోలు అడిగేవాళ్లు
  • అర్ధరాత్రి 3 గంటల సమయంలో పిలిచేవాళ్లు
  • ఓ ఇంటర్వ్యూలో మల్లికా షరావత్
ఐటమ్ గార్ల్ గా, బోల్డ్ నటిగా ముద్రపడ్డ మల్లికా షరావత్, తాజాగా కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, హీరోలతో తాను చనువుగా లేనందుకే కొన్ని సినిమాల నుంచి తప్పించారని వాపోయింది. తెరపై నటించేటప్పుడు బయట చనువుగా, దగ్గరగా ఉండటానికి ఇబ్బందేంటని తనను ప్రశ్నించేవారని, అర్థరాత్రి మూడు గంటల సమయంలో ఫోన్ చేసి, గదికి రమ్మని పిలిచేవారని ఆవేదన వ్యక్తం చేసింది.

'మర్డర్' చిత్రంతో బాలీవుడ్ కు పరిచయమైన తనకు అటువంటి పాత్రలే వచ్చాయని, హీరోలు, దర్శకుల కారణంగానే తనలోని నటి దూరమై, హాట్ గార్ల్ గా మిగిలానని వెల్లడించింది. తెరపై పొట్టి దుస్తులు వేసుకుని, ముద్దు సన్నివేశాల్లో నటించిన తనను సిగ్గు వదిలేసిన మహిళంటూ నిందలు వేశారని చెప్పింది. తొలినాళ్లలో ఎలాంటి పాత్రల్లోనైనా నటించడమే తాను చేసిన తప్పని చెప్పింది. గత కొంతకాలంగా మల్లిక సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
Mallika Sharawat
Item Girl
Bollywood
Shocking Comments

More Telugu News