Andhra Pradesh: తన కోసం ట్రాఫిక్ నిలిపివేసిన పోలీసులపై ఏపీ డీజీపీ అసహనం

  • ఠాకూర్ కోసం సాధారణ వాహనాల నిలిపివేత
  • ఎయిర్ పోర్టు నుంచి వస్తూ చూసిన డీజీపీ
  • ఇకపై అలా చేయవద్దని ఆదేశాలు
ఇకపై తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను నిమిషం పాటు కూడా ఆపవద్దని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి ఠాకూర్ రాగా, విజయవాడకు ఆయన కాన్వాయ్ వెళుతున్న వేళ, ట్రాఫిక్ ను నిలిపివేసిన విషయాన్ని గమనించిన ఆయన పోలీసుల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు.

ప్రజలను ఇబ్బంది పెట్టే తీరు సరికాదని అభిప్రాయపడ్డ ఆయన, ఇకపై తాను ఎక్కడికి వెళ్లినా ట్రాఫిక్ ను ఆపరాదని ఆదేశాలు ఇస్తూ, ఇదే విషయాన్ని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు సూచించారు. వీఐపీలు ప్రయాణిస్తున్న వేళ కూడా సాధ్యమైనంత తక్కువగా మాత్రమే ట్రాఫిక్ ను ఆపాలని ఆయన సూచించారు. 
Andhra Pradesh
DGP
RP Thakur
Convoy
Traphic

More Telugu News