Tamilnadu: శశికళ కేసును తాను విచారించలేనన్న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి

  • ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో శశికళ
  • 1996 నాటి కేసు విచారణ 
  • గతంలో తాను శశికళకు న్యాయవాదినన్న న్యాయమూర్తి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు, ప్రస్తుతం కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్న శశికళపై దాఖలైన ఓ కేసును తాను విచారించలేనని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి సుబ్రమణియ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. 1996-97లో సంపాదించిన ఆస్తులపై ఆమె పన్ను ఎగ్గొట్టారన్న ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ ఈ కేసును దాఖలు చేయగా, దీనిపై విచారణ సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది.

ఇక ఈ కేసు బుధవారం నాడు న్యాయమూర్తులు ఎస్‌.మణికుమార్‌, సుబ్రమణియ ప్రసాద్‌ ల బెంచ్ పైకి వచ్చింది. తాను న్యాయవాదిగా ఉన్న వేళ, శశికళ తరఫున చాలా కేసుల్లో వాదించానని చెప్పిన జస్టిస్ ప్రసాద్, ఇప్పుడీ కేసును తాను విచారించ లేనని, మరో బెంచ్ కి బదిలీ చేయాలని చీఫ్ జస్టిస్ ను కోరారు. రూ. 4.97 కోట్ల ఆదాయంపై రూ. 10.13 లక్షల పన్ను చెల్లించలేదన్నది శశికళపై అభియోగం.
Tamilnadu
Sasikala
Lawyer
High Court

More Telugu News