Kathi Mahesh: కత్తి మహేశ్ ను హెచ్చరించిన బీజేపీ నేత కిషన్ రెడ్డి

  • శ్రీరాముడు, రామాయణంపై నోటికొచ్చినట్టు మాట్లాడటం తగదు
  • అలాంటి వారికి తగినబుద్ధి చెబుతాం
  • కత్తి మహేశ్ ను ఈ మధ్యే చూస్తున్నా

మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ ని బీజేపీ నేత కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొందరు స్వయం ప్రకటిత మేధావులు.. శ్రీరాముడు, రామాయణంపైనా వారి ఇష్టానుసారం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, అలాంటి వారికి తగినబుద్ధి చెబుతామని హెచ్చరించారు.

కత్తి మహేశ్ ను ఈ మధ్యే చూస్తున్నానని, ఆయన ఏ అంశంపైన మాట్లాడుకున్నా ఫర్వాలేదు కానీ, దేవుళ్ల పైనా, మత విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారు, మరో మతం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరా? అని ప్రశ్నించారు. హిందువులను కించపరిచేలా మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కిషన్ రెడ్డి ఆరోపించారు. 

  • Loading...

More Telugu News