YSRCP: వైసీపీలోకి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి?

  • బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమారుడు సిద్ధార్థరెడ్డి
  • పార్టీలో చేరేందుకు బంధువుల ద్వారా ప్రయత్నం
  • ఈ నెల 6న వైసీపీలో చేరనున్న సిద్ధార్థరెడ్డి?

మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ్ముడి కుమారుడు సిద్ధార్థరెడ్డి వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. కడప జిల్లాలోని తన సమీప బంధువుల ద్వారా వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధార్థ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించనున్నాయని, ఈ నెల 6వ తేదీన ఆ పార్టీలో చేరతారని ఆయన సన్నిహితుల సమాచారం. 

కాగా, మొదట్లో టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధార్థరెడ్డి ప్రయత్నాలు చేశారు. కానీ, కొంత కాలం వేచి చూసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. సిద్ధార్థరెడ్డిపై నమోదైన కేసుల కారణంగా ఆయన ప్రత్యక్షరాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలోనే కొంతకాలం నడిచిన సిద్ధార్థరెడ్డి, తన రాజకీయ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

More Telugu News