Pawan Kalyan: పవన్‌ పర్యటనను కూడా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు: సోము వీర్రాజు

  • బీజేపీని చూసి టీడీపీ భయపడుతోంది
  • మేము ఎవ్వరికీ భయపడబోం
  • మేము చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం
నెల్లూరు జిల్లాలో పర్యటిస్తోన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపైకి ఉమా మహేశ్వరరావు అనే వ్యక్తి చెప్పు విసిరిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ ఏపీ నేత సోము వీర్రాజు తాము సీఎం చంద్రబాబు కుటిల నీతిని అడ్డుకుంటామని అన్నారు. బీజేపీని చూసి టీడీపీ భయపడుతోందని అన్నారు. తాము ఎవ్వరికీ భయపడబోమని, తాము చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని అన్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనను కూడా టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు తీరు బాగోలేదని, ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎం ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దూషించినప్పటికీ ఆయన మౌనంగా ఉన్నారని సోము వీర్రాజు అన్నారు. టీడీపీ నేతలు కొరివితో తల గోక్కుంటున్నారని అన్నారు. రౌడీలతో దాడులు చేయిస్తున్నారని అన్నారు.
Pawan Kalyan
Telugudesam
somu veerraju

More Telugu News