Pawan Kalyan: ప్రశ్నించడానికి పవన్‌ కల్యాణ్‌కు కేంద్ర సర్కారు కనిపించట్లేదా?: రామ్మోహన్‌ నాయుడు

  • ఏపీకి రూ.74 వేల కోట్లు ఇవ్వాలని పవన్‌ అన్నారు
  • పవన్‌ కల్యాణ్‌ సినిమా ఇప్పుడు ఏమైంది?
  • ఢిల్లీలో జరిగిన లోపాయికారి ఒప్పందం ఏంటో చెప్పాలి

విశాఖపట్నానికి రైల్వే జోన్‌ కోసం తమ పోరాటం కొనసాగుతుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అన్నారు. విశాఖకు రైల్వే జోన్‌ కోసం ఈరోజు టీడీపీ ఎంపీలు చేస్తోన్న ఒకరోజు దీక్ష ముగిసింది. అనంతరం రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ... రైల్వేజోన్‌పై కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారని అన్నారు. కర్ణాటక ఫలితాలు బీజేపీకి ఒక శాంపిల్‌ మాత్రమేనని అన్నారు.

కాగా, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.74 వేల కోట్లు ఇవ్వాలన్న పవన్‌ కల్యాణ్‌ సినిమా ఇప్పుడు ఏమైందని రామ్మోహన్‌ నాయుడు ఎద్దేవా చేశారు. ప్రశ్నించడానికి పవన్‌ కల్యాణ్‌కు కేంద్ర సర్కారు కనిపించట్లేదా? అని నిలదీశారు. ఢిల్లీలో జరిగిన లోపాయికారి ఒప్పందం ఏంటో పవన్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

  • Loading...

More Telugu News