surya: సూర్య మూవీలో విలన్ గా మరో స్టార్ హీరో

  • కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య మూడో సినిమా 
  • ముఖ్యపాత్రల్లో మోహన్ లాల్ .. బొమన్ ఇరాని 
  • 10 దేశాల్లో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ  

ఇటీవల కాలంలో సూర్య ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ దర్శకుడితో 'వీడొక్కడే' .. 'బ్రదర్స్' సినిమాలు చేసిన సూర్య, ప్రస్తుతం ఆ దర్శకుడితో మూడవ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ .. బొమన్ ఇరాని కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా కోసం 'ఆర్య'ను తీసుకున్నారు. ఈ సినిమాలో ఆయన విలన్ గా కనిపించనున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమా షూటింగులో జాయినయ్యాడు. తమిళంలో హీరోగా 'ఆర్య'కి మంచి క్రేజ్ వుంది .. అలాంటి ఆర్య ఈ సినిమాలో విలన్ గా కనిపించనుండటం విశేషం. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. 10 దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందనీ .. ఆయా లొకేషన్స్ ఆడియన్స్ ను ఆశ్చర్యచకితులను చేస్తాయని చెబుతున్నారు.        

More Telugu News