Pawan Kalyan: కుటుంబాలు బాగుపడుతున్నాయి.. కానీ కులాలు బాగుపడట్లేదు: పవన్‌ కల్యాణ్

  • ఉత్తరాంధ్ర మేధావులతో చర్చించాను
  • వనరులు మావా? అభివృద్ధి పాలక వర్గాలకా?
  • వీరితో జరిపిన చర్చ నాలో నిబద్ధతను మరింత పెంచింది
తాను ఉత్తరాంధ్ర మేధావులతో చర్చించానని తెలుపుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఈరోజు ట్వీట్లు చేశారు. 'వనరులు మావా? అభివృద్ధి వాళ్లకా (పాలక వర్గాలకా?)... కుటుంబాలు బాగుపడుతున్నాయి కానీ కులాలు బాగుపడట్లేదు' అనే రెండు అంశాలు ఈ భేటీ ద్వారా తెలిశాయని తెలిపారు. ఈ సమావేశంలో ఏయూ మాజీ వీసీ కేవీ రమణ, కుప్పం యూనివర్సిటీ మాజీ వీసీ కేఎస్‌ చలం, ఏవీఎన్‌ కాలేజ్‌ మాజీ ప్రిన్సిపాల్‌ ఎన్‌.ప్రకాశ్‌ రావు, అంబేద్కర్‌ భవన్‌ అధ్యక్షుడు ఎన్‌.కల్యాణ్‌ రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌ శివ శంకర్‌ పాల్గొన్నారని పవన్ తెలిపారు. ఉత్తరాంధ్ర వెనకబాటుదనంపై పోరాడే క్రమంలో వీరితో జరిపిన చర్చ తన నిబద్ధతను మరింత పెంచిందని ట్వీట్ చెప్పారు.    
Pawan Kalyan
Jana Sena

More Telugu News