Kathi Mahesh: కత్తి మహేష్ పై కఠిన చర్యలు తీసుకోండి.. లేకపోతే ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు: నాగబాబు

  • రాముడిపై దారుణ వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై చర్యలు తీసుకోండి
  • హిందూ మతంపై ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతోంది
  • రామాయణం అంటే ఒక పుస్తకం కాదు

హిందువులు ఎంతో భక్తిభావంతో కొలిచే శ్రీరాముడిపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మెగా బ్రదర్ నాగబాబు డిమాండ్ చేశారు. ఏమతాన్నైనా కించపరుస్తూ ఎవరు మాట్లాడినా తప్పేనని అన్నారు. రామాయణం అనేది పుస్తకం కాదని... కోట్లాది మంది ఆరాధించే శ్రీరాముడి చరిత్ర అని అన్నారు. ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ ఎలాగో... హిందువులకు రామాయణం, మహాభారతం అలాంటివని చెప్పారు.

హిందూమతం, హిందూ దేవుళ్లపై ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతోందని నాగబాబు అన్నారు. నాస్తికత్వం పేరుతో హిందువుల మనోభావాలను కించపరిచేలా ప్రవర్తించేవారు శిక్ష అనుభవిస్తారని అన్నారు. మత విశ్వాసాలను కించపరిచే విధంగా మాట్లాడితే, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కత్తి మహేష్ పై ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని... లేకపోతే ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారని చెప్పారు. 

  • Loading...

More Telugu News