బీజేపీ కావాలో లేక టీడీపీ కావాలో ప్రజలే తేల్చుకోవాలి: కన్నా

రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న బీజేపీ కావాలో లేక అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పంచాయతీలకు వస్తున్న కేంద్ర నిధులను కూడా టీడీపీ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. రైతుల కోసం ముఖ్యమంత్రి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

 ఇప్పటి వరకు రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. గతంలో వెంకయ్యనాయుడుని ఊరూరా తిప్పి సన్మానాలు చేశారని... ఇప్పుడు యూటర్న్ తీసుకుని బీజేపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ విజయం సాధిస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
Go Back to Shorts
kanna lakshminarayana
bjp
Chandrababu

More Telugu News