Konda Surekha: కొండా మురళి ఒరిజినల్ బ్రీడ్.. హైబ్రీడ్ మనుషులు పిచ్చి వేషాలు వేస్తే సహించబోం: కొండా సురేఖ వార్నింగ్

  • కొత్తగా కొందరు మీసాలు మెలేస్తున్నారు
  • మీసాలు మెలేస్తే.. ఉన్నవి కూడా ఊడతాయ్
  • పిచ్చి వేషాలు వేయకండి
వరంగల్ తూర్పు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో కొత్తగా కొందరు మీసాలు మెలేస్తున్నారని... మీసాలు మెలేస్తే, ఉన్న మీసాలు కూడా ఊడతాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే రావాలని, కొండా మురిళి ఒరిజినల్ బ్రీడ్ అని... హైబ్రీడ్ మనుషులు పిచ్చి వేషాలు వేస్తే, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వివిధ మత పెద్దల సమక్షంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమానికి కొండా దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

రంజాన్ తర్వాత ఈద్ మిలాప్ నిర్వహించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా కొండా మురళి అన్నారు. వివిధ మతాలవారు కలసి ఈ పండుగను నిర్వహించుకోవడం అభినందనీయమని చెప్పారు. కులమతాలకు అతీతంగా అందరూ కలసి ముందుకు సాగాలని అన్నారు. అనంతరం పలు మతాల పెద్దలను ఘనంగా సన్మానించారు. 
Konda Surekha
konda murali
warning

More Telugu News