mammootty: వైఎస్ జయంతి రోజున 'యాత్ర' టీజర్ రిలీజ్

  • వైఎస్ బయోపిక్ గా 'యాత్ర'
  • ప్రధానమైన పాత్రలో మమ్ముట్టి 
  • ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు .. సుహాసిని

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను 'యాత్ర' పేరుతో దర్శకుడు మహి.వి రాఘవ్ రూపొందిస్తున్నాడు. మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమా టీజర్ కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ఆ రోజున రాజశేఖర్ రెడ్డి జయంతి కావడం వలన ఈ నిర్ణయం తీసుకున్నారట. జగపతిబాబు .. సుహాసిని .. రావు రమేశ్ .. అనసూయ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం .. ప్రజలపై ఆయన చూపిన ప్రభావం ప్రధానంగా ఈ సినిమా కొనసాగుతుందని చెబుతున్నారు. 

More Telugu News