Telugudesam: జగన్, పవన్ ఏం చేసినా అంతే... ముందుస్తు వస్తే జరిగేది ఇదే: మంత్రి ప్రత్తిపాటి ఆసక్తికర వ్యాఖ్యలు

  • టీడీపీకి ఏకపక్ష విజయం
  • 25 ఎంపీ సీట్లూ వస్తాయి
  • జగన్, పవన్ ప్రజలను మెప్పించలేరన్న ప్రత్తిపాటి
ముందస్తు ఎన్నికలు సంభవిస్తే, తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా విజయాన్ని సాధించనుందని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. హనుమాన్ జంక్షన్ లోని టీడీపీ నేత పుట్టగుంట సతీష్ కుమార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, 25 పార్లమెంట్ సీట్లూ టీడీపీకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎంతదూరం నడిచినా, కొత్తగా వచ్చిన నేత పవన్ కల్యాణ్ ఎన్ని బస్సులెక్కి యాత్రలు చేసినా, ప్రజలను మెప్పించే పరిస్థితి లేదని విమర్శించారు. దేశానికి ప్రధాని ఎవరో నిర్ణయించే శక్తి చంద్రబాబుకు ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని అన్నారు. ఈ నెల నుంచి రేషన్ దుకాణాల్లో కార్డుకు రెండు కిలోల కందిపప్పు ఇవ్వాలని నిర్ణయించామని, దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 10కి అరకిలో పంచదార ఇస్తున్న ఘనత తమదేనని తెలిపారు.
Telugudesam
Prattipati Pullarao
Jagan
Pawan Kalyan
Andhra Pradesh

More Telugu News