naga chaitanya: 'సవ్యసాచి' విడుదల తేదీ ఖరారైపోయింది

  • చందూ మొండేటి దర్శకుడిగా 'సవ్యసాచి'
  • చైతూ జోడీగా నిధి అగర్వాల్ 
  • కీలక పాత్రలో భూమిక  

చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై 'సవ్యసాచి' సినిమా రూపొందుతోంది. నాగచైతన్య కథానాయకుడిగా నిర్మితమవుతోన్న ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 10 రోజులపాటు జరిగే షూటింగుతో గుమ్మడికాయ కొట్టేస్తారు. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుందా అనే ఆసక్తితో అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఆగస్టు 17వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చేశారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా, ఆయన అక్క పాత్రలో భూమిక కనిపించనుంది. గతంలో చందూ .. చైతూ కలిసి చేసిన 'ప్రేమమ్' ఘన విజయాన్ని సాధించడం వలన, ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి మరి.  

  • Loading...

More Telugu News