chandrababu: ఎస్వీ రంగారావు అంతటి నటులు మరెవరూ లేరు!: చంద్రబాబు

  • ఘనంగా ప్రారంభమైన ఎస్వీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు
  • తెలుగు ప్రజలు గర్వపడే నటుల్లో ఎస్వీఆర్ ఒకరంటూ ప్రశంస
దివంగత ఎస్వీ రంగారావు మహా నటుడని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఆయన అంతటి స్థాయి ఉన్న నటులు లేరని, భవిష్యత్తులో రాలేరని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఎస్వీఆర్ శత జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు కాంబినేషన్లో ఎన్నో మంచి చిత్రాలు వచ్చాయని చెప్పారు. ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో అద్భుతంగా నటించి గొప్ప నటుడిగా పేరుగాంచారని తెలిపారు. తెలుగు ప్రజలు గొప్పగా చెప్పుకునే నటుల్లో ఎస్వీఆర్ ఒకరని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీపరిశ్రమకు చెందిన వేణుమాధవ్, శివాజీరాజా, పరుచూరి వెంకటేశ్వరరావు, ఝాన్సీ తదితరులు హాజరయ్యారు.
chandrababu
sv rangarao
statue

More Telugu News