selfies: లలితా జ్యూయలర్స్‌ కంపెనీ ఎండీతో అల్లు శిరీష్‌ సెల్ఫీ.. ఆసక్తికర ట్వీట్‌

  • సెల్ఫీలు ఎవరికీ ఊరికే రావు
  • 'లక్‌ ఉండాలి..హా హా' అంటోన్న అల్లు శిరీష్‌
  • విమానాశ్రయంలో కిరణ్‌కుమార్‌ను కలిసిన నటుడు
'సెల్ఫీలు ఎవరికీ ఊరికే రావు.. లక్‌ ఉండాలి..హా హా' అంటూ సినీనటుడు అల్లు శిరీష్‌ చేసిన ట్వీట్‌ అలరిస్తోంది. 'డబ్బులు ఊరికే రావు' అంటూ లలితా జ్యూయలర్స్‌ కంపెనీ యాడ్‌లో తానే కనపడి ఆకర్షించిన కిరణ్ కుమార్‌ సోషల్ మీడియాలో గుండూ బాస్‌గా ఫేమస్‌ అయిపోయిన విషయం తెలిసిందే. ఆయనను తాను ఓ విమానాశ్రయంలో కలిశానని తెలుపుతూ అల్లు శిరీష్‌ ఈ ట్వీట్‌ చేశాడు. ఓ సెల్ఫీ కావాలని ఆయనను అడిగి తీసుకున్నానని చెబుతూ దాన్ని పోస్ట్‌ చేశాడు. కాగా, శిరీష్‌ నటించిన ‘యుద్ధభూమి’ సినిమా ఇటీవలే విడుదలైన విషయం విదితమే.
selfies
allu shirish

More Telugu News