rakul preeth: రేపటి రోజున అవకాశాలు లేకుండా పోతాయేమోననే భయం లేదు: రకుల్

  • రేపటి శ్వాసను ఈ రోజు పీల్చలేం 
  • ఈ రోజును గురించే ఆలోచిస్తాను 
  • నా ఆత్మవిశ్వాసమే నాకు శ్రీరామరక్ష
తెలుగులో చిన్న సినిమాతో కథానాయికగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన రకుల్, ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చిన కథానాయికలను చకచకా దాటేస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోయింది. వెంటవెంటనే అగ్రకథానాయకుల సరసన అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. రకుల్ గురించి తెలిసినవాళ్లు ఆమెకి అందమే కాదు .. ఆత్మవిశ్వాసమూ ఎక్కువేనని అంటారు. తాజాగా తన మాటల ద్వారా అదే విషయాన్ని మరోమారు స్పష్టం చేసింది.

"రేపటి శ్వాసను ఈ రోజు పీల్చలేం .. ఈ రోజు ఇప్పుడు పీల్చే శ్వాస మాత్రమే మనల్ని బతికిస్తుంది. అందువలన నేను ఈ రోజు .. ఇప్పుడు చేయవలసిన పనులను గురించి మాత్రమే ఆలోచిస్తాను. రేపటి గురించిన ఆలోచనలు .. ఆందోళనలు .. భయాలు నాకు ఉండవు. రేపటి రోజున అవకాశాలు లేకపోతే పరిస్థితి ఏంటి? అనే భయాలు కూడా పెట్టుకోను. కష్టపడటం తెలుసు .. వాస్తవంలో బతకడం తెలుసు. నా ఆత్మవిశ్వాసమే నాకు శ్రీరామరక్ష అని నేను భావిస్తూ వుంటాను" అని చెప్పుకొచ్చింది.  
rakul preeth

More Telugu News