Iran: వాతావరణ పరిస్థితులను కూడా మార్చేస్తున్నారు... ఇజ్రాయెల్ పై ఇరాన్ ఆరోపణలు!

  • మా మేఘాలను దొంగిలిస్తోంది 
  • పక్క దేశాల్లో వర్షాలున్నా తమకు లేవని ఆరోపణ
  • సైంటిఫిక్ విభాగం అధ్యయనంలో తేలిందన్న ఇరాన్ 

తమ దేశపు వాతావరణాన్ని ఇజ్రాయెల్ దొంగిలిస్తోందని, తమవైపు రావాల్సిన మేఘాలను ఆ దేశం మళ్లిస్తోందని ఇరాన్ విచిత్రమైన ఆరోపణలు చేసింది. ఇరాన్ వాతావరణ పరిస్థితులను మారుస్తున్నారని తమకు అనుమానంగా ఉందని ఇరాన్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ హెడ్ జనరల్ ఘూలమ్ రెజా జలాలీ ఓ మీడియా సమావేశంలో ఆరోపించారు. వర్షాలు కురవకపోవడానికి, మంచు కనిపించక పోవడానికి కారణాలను ఇరానియన్ సైంటిఫిక్ విభాగం అధ్యయనం చేసిందని, ఇజ్రాయెల్ ప్రమేయాన్ని వారు ధ్రువీకరించారని ఆయన ఆరోపించారు.

ఇదే ప్రాంతంలోని మరో దేశంపైనా ఇజ్రాయెల్ వాతావరణ యుద్ధం చేస్తోందని ఆయన అన్నారు. ఆఫ్గనిస్తాన్ నుంచి మధ్యదరా సముద్ర ప్రాంతం వరకూ 2,200 మీటర్ల ఎత్తున మంచు పేరుకుపోయి ఉందని, ఇరాన్ పై మాత్రం అది లేదని ఆయన తెలిపారు. కాగా, గత కొంతకాలంగా ఇరాన్ లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పక్క దేశాల్లో వర్షాలు పడుతున్నా, ఇరాన్ పై మాత్రం వరుణుడు కరుణించడం లేదు.

More Telugu News