Jagapati Babu: వైఎస్ రాజారెడ్డిగా జగపతిబాబు?

  • విభిన్న తరహాపాత్రలలో జగపతిబాబు 
  • 'యాత్ర'లో రాజారెడ్డి పాత్రకు ఎంపిక
  • వైఎస్ పాత్రలో మమ్ముట్టి 
తన సెకండ్ ఇన్నింగ్స్ లో విభిన్న తరహా పాత్రలను పోషిస్తూ ముందుకు సాగుతున్న ప్రముఖ నటుడు జగపతిబాబు తాజాగా మరో కీలక పాత్రను పోషించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా రూపొందుతున్న 'యాత్ర' సినిమాలో వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రను జగపతి పోషించనున్నట్టు తెలుస్తోంది.

 రాయలసీమ వాసులకు సుపరిచితుడైన రాజారెడ్డి 1998లో ప్రత్యర్థుల బాంబు దాడిలో మరణించారు. ఈ చిత్రంలో ఈయన పాత్ర కూడా కీలకమైనదేనట. ఫెరోషియస్ గా కనిపించే ఈ పాత్రకు జగపతిబాబు సరిగ్గా సరిపోతారన్న అంచనాతో ఆయనను ఎంచుకున్నట్టు చెబుతున్నారు. వైఎస్ పాత్రను మమ్ముట్టి పోషిస్తున్న ఈ చిత్రానికి మహి వి.రాఘవ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కొనసాగుతోంది.
Jagapati Babu
YSRajashekharReddy
Mammutti

More Telugu News