New Delhi: ఢిల్లీ సామూహిక మరణాల కేసు.. 11 మృతదేహాల పోస్టుమార్టం రిపోర్టు వెల్లడి!

  • ముగిసిన పోస్టుమార్టం
  • నలుగురి కడుపులో విషపు ఆనవాళ్లు
  • అందరూ రాజస్థాన్ చిత్తోర్ గఢ్ ప్రాంత వాసులే
న్యూఢిల్లీలో జరిగిన సామూహిక ఆత్మహత్యల వెనుక మరిన్ని వివరాలు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడయ్యాయి. వీరిలో ఆరుగురు కేవలం మెడకు ఉరి బిగుసుకున్న కారణంతోనే మరణించారని మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన వైద్యులు తేల్చారు. మరో నలుగురికి ఆహారంలో విషం పెట్టి హత్య చేశారని, ఓ వృద్ధురాలిని దారుణంగా చంపారని వైద్యులు వెల్లడించారు. వృద్ధురాలిని బలంగా కొట్టి, ఊపిరి ఆడకుండా చేసి చంపారని తెలిపారు.

 కాగా, లభించిన ఆధారాలను బట్టి వీరి కుటుంబంలోని కొందరు మోక్షం కోసం ఈ పని చేసినట్టు తెలుస్తుండగా, విషయం బయటకు చెబుతుందేమోనన్న భయంతో వృద్ధురాలిని హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులంతా రాజస్థాన్ లోని చిత్తోర్ గఢ్ కు చెందిన వారని, వారి బంధువులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.
New Delhi
Mass Sucide
Postmartam
Police

More Telugu News