Krishna District: మా నాన్న చాలా మంచోడు...అక్కంటేనే తనకు ఎక్కువ ఇష్టం!: తండ్రి చేతిలో హతమైన చంద్రిక చెల్లెలు

  • తనకన్నా అక్కంటేనే ఎక్కువ ప్రేమ
  • చంద్రిక చెల్లెలు శిరీష
  • ముగిసిన చంద్రిక అంత్యక్రియలు
తన తండ్రి చాలా మంచి వ్యక్తని, తనకన్నా, అక్క చంద్రిక అంటేనే ఆయనకు ఎక్కువ ప్రేమని, మొన్న కుమార్తెను కొట్టి చంపిన కోటయ్య చిన్న కుమార్తె శిరీష వ్యాఖ్యానించింది. కృష్ణా జిల్లా చందర్లపాడులో, కుమార్తె ప్రేమలో పడిందని తెలుసుకున్న కోటయ్య, పరువుహత్యకు పాల్పడగా, క్షణికావేశంలో ఇంత తప్పు జరిగిపోయిందని విలపించిన శిరీష, తన బాగోగులు చూసేందుకు తండ్రి కావాలని వేడుకుంది.

నిన్న చంద్రిక మృతదేహానికి పోస్టుమార్టం చేయించిన పోలీసులు, అనంతరం బంధువులకు అప్పగించారు. కుమార్తెను ఆఖరి సారి చూసేందుకు కోటయ్యకు అనుమతి ఇవ్వాలని బంధువులు వేడుకున్నా పోలీసులు అంగీకరించలేదు. తండ్రి కోటయ్య లేకుండానే చంద్రిక అంత్యక్రియలు ముగిశాయి. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సహా పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించారు.
Krishna District
Chandarlapadu
Kotaiah
Chandrika
Murder

More Telugu News