kurian: కురియన్ కు అధికారికంగా వీడ్కోలు పలికిన వెంకయ్యనాయుడు

  • డిప్యూటీ ఛైర్మన్ గా ముగిసిన కురియన్ పదవీకాలం
  • వెంకయ్యనాయుడు నివాసంలో వీడ్కోలు కార్యక్రమం
  • హాజరైన పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ, కాంగ్రెస్ నేతలు

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ పదవీకాలం ముగిసింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు అధికారికంగా వీడ్కోలు పలికారు. వెంకయ్య నివాసంలో ఈ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, తదుపరి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ను అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఎన్నుకోవాలని కోరారు. కేరళకు చెందిన కురియన్ 2006 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2012 ఆగస్టు 21న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు.

మరోవైపు రాజ్యసభలో ఎన్టీయే కంటే ప్రతిపక్ష కూటమికే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. దీంతో ప్రతిపక్ష సభ్యుడే ఆ పదవిని అలంకరించే అవకాశం వుంది.

More Telugu News