kiran kumar reddy: రాహుల్ సూచన మేరకే కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించాం: పల్లంరాజు

  • పార్టీని వీడిన నేతలను మళ్లీ ఆహ్వానించాలని రాహుల్ సూచించారు
  • కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు
  • పార్టీ బలోపేతం కావాలంటే.. నాయకత్వం కూడా బలంగా ఉండాలి
పార్టీని వీడిన నేతలను మళ్లీ ఆహ్వానించాలంటూ రాహుల్ గాంధీ చెప్పారని... ఆయన సూచన మేరకే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించామని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు తెలిపారు. ఆలోచించి తుది నిర్ణయం తీసుకుంటానని కిరణ్ చెప్పారని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడేనని చెప్పారు.

ఏపీ ప్రజలు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే... నాయకత్వం కూడా బలంగా ఉండాలని తెలిపారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఊమెన్ చాందీతో కలసి, పలువురు నేతలు ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే.
kiran kumar reddy
Rahul Gandhi
pallamraju

More Telugu News