rss: ఏ సమయంలోనైనా లాహోర్ లోకి భారత సైన్యం ప్రవేశిస్తుందని చెప్పడమే సర్జికల్ స్ట్రయిక్స్ అర్థం!: ఆరెస్సెస్

  • అఖండ భారతాన్ని పునర్నిర్మించడమే ఆరెస్సెస్ లక్ష్యం
  • ఏ క్షణంలోనైనా లాహోర్ లో అడుగుపెడతాం
  • లాహోర్ లో ఇల్లు కట్టుకోవాలన్నదే నా కోరిక

పాకిస్థాన్ లోని లాహోర్ నగరంలోకి భారత సైన్యం ప్రవేశిస్తుందని ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ పై భారత్ గతంలో చేసిన సర్జికల్ దాడులే దీనికి నిదర్శనమని చెప్పారు. 300 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టిందని... జాగ్రత్తగా ఉండాలంటూ పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చారు.

సైన్యం, ఎన్ఐఏ నిఘా విభాగాలకు ఎన్డీయే ప్రభుత్వం స్వేచ్ఛను ఇవ్వడం వల్లే ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోందని అన్నారు. ఏ క్షణంలోనైనా లాహోర్ లో అడుగుపెడతామని పాకిస్థాన్ కు చెప్పడమే సర్జికల్ దాడుల సారాంశమని చెప్పారు. అఖండ భారతాన్ని పునర్నిర్మించడమే తమ లక్ష్యమని అన్నారు. నాగ్‌పూర్‌, లాహోర్ లలో కూడా నివాసాలు కట్టుకోవాలని తనకు ఉందని చెప్పారు. అఖండ భారతాన్ని నిర్మించేందుకు ఆరెస్సెస్ పని చేస్తుందని తెలిపారు.

More Telugu News