mukhesh gowd: దానం నాగేందర్ వ్యాఖ్యలను ఖండించిన ముఖేష్ గౌడ్

  • బీసీలు, దళితులు, మైనార్టీలు చేయి కలిపితే తిరుగుండదు
  • కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం కనుకనే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నా
  • కాంగ్రెస్ నేతల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్న మాట నిజమే

కాంగ్రెస్ పార్టీలో బీసీలు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందంటూ టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ ఖండించారు. కాంగ్రెస్ లో బీసీలను అణగదొక్కడం లేదని చెప్పారు. బీసీలు యాచించేవారుగా ఉండకూడదని... లాక్కునేవారిగా ఉండాలని అన్నారు. ఎవరికిందా బీసీలు పని చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. బీసీలు, మైనార్టీలు, దళితులు చేయి కలిపితే... తిరుగుండదని అన్నారు.

తెలంగాణ కొత్త రాష్ట్రమని, కొత్త ప్రభుత్వం ఏర్పడిందని, అందుకే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నానని చెప్పారు. గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్న మాట వాస్తవమేనని... పార్టీలో ఇలాంటివన్నీ సహజమేనని చెప్పారు. పార్టీ మారే అంశంపై అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

  • Loading...

More Telugu News