Uttarakhand: ఉత్తరాఖండ్ లోయలో పడిన బస్సు... 40 మంది మృతి!

  • ఈ ఉదయం ప్రమాదం
  • లోయలో పడిన మినీ బస్సు
  • సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్
ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఉదయం పిపాలి - భోన్ రహదారిపై వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోగా, 35 మంది అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. ఓ మినీ బస్సులో 45 మందికి పైగా ప్రయాణికులు భోన్ నుంచి రామ్ నగర్ కు బయలుదేరారని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించామని అధికారులు తెలిపారు.

విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఘర్ వాల్ కమిషనర్ దిలీప్ జావాల్కర్ తెలిపారు.
Uttarakhand
Road Accident
Mini Bus

More Telugu News