Srinidhi College: కేటీఆర్ తో మొరపెట్టుకున్న 'శ్రీనిధి' ఇంజనీరింగ్ విద్యార్థులు... స్పందించిన మంత్రి!

  • శ్రీనిధి కాలేజీలో ఫీజుల పెంపు
  • గత నాలుగు రోజులుగా నిరసనలు
  • కడియం శ్రీహరితో మాట్లాడతానన్న కేటీఆర్

తమ కాలేజీలో ఫీజులను విపరీతంగా పెంచేశారని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఫిర్యాదుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గత నాలుగు రోజులుగా పెంచిన ఫీజలు తగ్గించాలని మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలంలోని శ్రీనిధి కాలేజీ ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

కాలేజీ ఫీజు రూ. 97 వేలు కాగా, రూ. 1.37 లక్షలు వసూలు చేస్తున్నారన్నది ఆరోపణ. కాగా, వారి ఆందోళనపై తన ఖాతాకు ట్వీట్లు వస్తుండటంపై కేటీఆర్ స్పందించారు. "శ్రీనిధిలో ఫీజు పెంపుల విషయమై చాలా ట్వీట్లు వచ్చాయి. నేను ఈ విషయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో చర్చిస్తాను" అని వ్యాఖ్యానించారు. తమ సమస్యపై స్పందించిన కేటీఆర్ కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News