New Delhi: ఢిల్లీలో కలకలం... ఒకే ఇంట్లో 11 మృతదేహాలు!

  • బురారీ ప్రాంతంలో ఘటన
  • రంగంలోకి దిగిన పోలీసులు
  • మృతుల్లో ఏడుగురు మహిళలు
దేశ రాజధాని ఢిల్లీలో ఒకే ఇంట్లో 11 మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. బురారీ ప్రాంతంలో ఈ ఘటన జరుగగా, పోలీసులు రంగంలోకి దిగారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. కొన్ని మృతదేహాలు ఉరి వేసుకున్నట్టు కనిపిస్తుండగా, మరికొన్ని చేతులు కట్టేసి ఉన్న స్థితిలో నేలపై పడి ఉన్నాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి వచ్చి, మొత్తం ఇంటిని సీజ్ చేసి విచారణ ప్రారంభించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండవచ్చని, వీరంతా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడి ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
New Delhi
Burari
Hanging
Died

More Telugu News