vijaymallya: ఆగస్టు 27లోగా రండి.. లేదంటే మీరు ఆ కోవకే చెందుతారు: మాల్యాకు స్పష్టం చేసిన కోర్టు

  • మాల్యా ఆస్తుల జప్తుకు అనుమతించాలన్న ఈడీ
  • కోర్టులో హాజరు కావాలంటూ ఆదేశం
  • లేదంటే ఆస్తుల జప్తు తప్పదంటూ హెచ్చరిక

తనపై వస్తున్న ఆరోపణల వెనక ఉన్న నిజాలను నిగ్గు తేల్చాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఇటీవల సుదీర్ఘ ప్రకటన విడుదల చేసిన విజయ్ మాల్యాకు ప్రత్యేక న్యాయస్థానం షాకిచ్చింది. ఆగస్టు 27లోగా భారత్ వచ్చి కోర్టులో హాజరు కావాల్సిందేనని, లేదంటే ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి’గా ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతేకాక, మాల్యా రూ.12,500 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసుకుంటుందని పేర్కొంది.

మాల్యాను పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాక, మాల్యాకు చెందిన రూ.12,500 కోట్ల ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని అందులో కోరింది. దీనిని విచారించిన కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది.

కాగా, ప్రభుత్వం ఇటీవల ఫ్యూజిటివ్‌ ఎకనమిక్‌ అఫెండర్స్‌ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం.. పారిపోయిన వ్యక్తుల ఆస్తులను జప్తు చేసుకునే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది.

  • Loading...

More Telugu News