Guntur District: మంగళగిరిలో దారుణం.. ప్రియుడి సమక్షంలోనే ప్రియురాలిపై దుండుగుల అత్యాచారం!

  • ప్రియుడిపైనే పోలీసుల అనుమానం
  • నిందితుల కోసం గాలింపు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువతి 
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సమీపంలోని మంగళగిరిలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి బయటకు వెళ్లిన ప్రియురాలిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రేమ జంటను అడ్డుకున్న దుండగులు ప్రియుడిని బెదిరించి ప్రియురాలిపై అతడి సమక్షంలోనే దారుణానికి పాల్పడ్డారు. రాత్రంతా ఈ అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నారు.

ప్రస్తుతం బాధిత యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రియుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. విషయం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
Guntur District
Mangalagiri
girl
Rape

More Telugu News