DGP: రాష్ట్రంలో రౌడీయిజం లేకుండా చేస్తాను: ఏపీ కొత్త డీజీపీ ఠాకూర్

  • డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆర్పీ ఠాకూర్‌
  • తల్లిదండ్రుల ఆశీస్సులతో డీజీపీగా ఎదిగాను
  • అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకి కృతజ్ఞతలు
  • రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడానికి కృషి చేస్తాను
డీజీపీగా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ఏపీ కొత్త డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్నారు. ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... డీజీపీగా బాధ్యతలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రుల ఆశీస్సులతో డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టానని అన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడానికి కృషి చేస్తానని, రాష్ట్రంలో రౌడీయిజం లేకుండా చేస్తానని ఠాకూర్ అన్నారు. దేశంలోనే ఏపీ పోలీస్‌ వ్యవస్థ చాలా బలమైందని అన్నారు.  
DGP
Andhra Pradesh

More Telugu News