swara bhaskar: ఓ నిర్మాత నా చెవిపై ముద్దు పెట్టేందుకు యత్నించాడు: స్వరా భాస్కర్

  • ఓ నిర్మాత నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి
  • ఐ లవ్ యూ బేబీ అంటూ తాకబోయాడు
  • ఇదంతా క్యాస్టింగ్ కౌచ్ లో భాగమే
తన జీవితంలో జరిగిన ఓ చేదు ఘటన గురించి మాట్లాడుతూ, ఓ సందర్భంలో క్యాస్టింగ్ కౌచ్ నుంచి తాను తప్పించుకున్నానని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ తెలిపింది. ఓ నిర్మాత నుంచి తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని చెప్పింది. తన వెనుక నిల్చుని 'ఐ లవ్ యూ బేబీ' అంటూ తనను తాకబోయాడని, తన చెవికి ముద్దు పెట్టడానికి యత్నించాడని తెలిపింది. ఇదంతా క్యాస్టింగ్ కౌచ్ లో భాగమేనని చెప్పింది.

ఇటీవల విడుదలైన 'వీరే ది వెడ్డింగ్' చిత్రంలో కరీనా కపూర్, సోనమ్ కపూర్ లతో కలసి స్వరా భాస్కర్ నటించింది. శశాంక్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా... బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. మరోవైపు, తెలుగులో హిట్ అయిన 'ప్రస్థానం' సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. సంజయ్ దత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో... స్వరా భాస్కర్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తోంది.
swara bhaskar
bollywood
Casting Couch
producer

More Telugu News