Asaduddin Owaisi: దమ్ముంటే మోదీ, అమిత్ షాలను నాపై పోటీ చేయమనండి: ఒవైసీ సవాల్

  • హైదరాబాదుకు వచ్చి నాపై పోటీ చేయండి
  • బీజేపీ, కాంగ్రెస్ లు కలిసి పోటీ చేసినా నన్ను ఓడించలేరు
  • దేశానికి మోదీ చేసిందేమీ లేదు
ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. 'దమ్ముంటే హైదరాబాద్ రండి. నాపై పోటీ చేసి గెలవండి' అంటూ ఛాలెంజ్ చేశారు. హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి తనపై పోటీ చేసేందుకు ఎవరైనా రావచ్చని... మోదీ, అమిత్ షా అయినా, కాంగ్రెస్ నేతలైనా సరే అంటూ సవాల్ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి పోటీ చేసినా... తనను ఓడించడం వారి తరం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందస్తుగానే ఎన్నికలను జరిపించేందుకు మోదీ సిద్ధపడుతున్నారని... ఆయనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. నాలుగేళ్ల మోదీ పాలనలో ప్రజలకు నిరాశ తప్ప మరేం మిగల్లేదని చెప్పారు. దేశానికి మోదీ చేసింది శూన్యమని అన్నారు.
Asaduddin Owaisi
challenge
modi
amit shah

More Telugu News